సినిమాలో విలన్ పాత్ర వైసీపీది.. మెయిన్ విలన్ జగనే: మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

by Seetharam |
సినిమాలో విలన్ పాత్ర వైసీపీది.. మెయిన్ విలన్ జగనే: మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు
X

దిశ , డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు సెటైర్లు వేశారు. అది సామాజిక సాధికర యాత్ర కాదని మోసగాళ్ల యాత్ర అని ధ్వజమెత్తారు. మోసగాళ్ళు అంతా చేరి సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో బలహీన వర్గాలు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. బలహీన వర్గాల మాన, ధన, ప్రాణాలకు విలువ లేదని ధ్వజమెత్తారు. సినిమాలో విలన్ పాత్రని వైసీపీ మనుషులు పోషిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ రాష్ట్రానికి మెయిన్ విలన్ జగన్ అని మండిపడ్డారు. 74 మంది బీసీలను హతమార్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. రిజర్వేషన్‌లను తగ్గించడం...దళిత పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైసీపీది అని..చంపిన వాళ్ళే సానుభూతి వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. కుహనా మేధావులు అంత ప్రజల ముందుకు వస్తున్న మంత్రి మేరుగ నాగార్జున లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు రెడ్ల చేతిలో చిక్కిపోయిందని ధ్వజమెత్తారు. ఎవరికి ఉద్యోగం ఇవ్వాలో... ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలో నిర్ణయించేది ఆ నలుగురు రెడ్డిలేనని చెప్పుకొచ్చారు. బీసీల ఆత్మగౌరవాన్ని రెడ్లకు పాదాక్రాంతం చేసిన వైసీపీ వారా మాట్లాడేదని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులారా మీకు ఆత్మాభిమానం లేదా? వైసీపీ ది బస్సు యాత్ర కాదు దగాకోరుల దండయాత్ర... దండగమారి యాత్ర అని ధ్వజమెత్తారు. ఈ వైసీపీ నయవంచకులకు బుద్ది చెప్పండి...రాయదుర్గంలో సామాజిక బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయం అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed