గ్రామ సచివాలయాలు పెద్ద కుంభకోణం: వైసీపీ ఎంపీ రఘురామ

by Disha News Desk |
గ్రామ సచివాలయాలు పెద్ద కుంభకోణం: వైసీపీ ఎంపీ రఘురామ
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి తనదైన శైలిలో మండిపడ్డారు. ఢిల్లీలో మంగళవారం మాట్లాడిన ఎంపీ, రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు పెద్ద కుంభకోణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ నిధులు గ్రామ సచివాలయాలకు ఆడుతున్నారని ఆరోపించారు. జగన్‌ పాలిస్తారని ప్రజలు ఓట్లు వేస్తే, పత్రికల్లో పనిచేసే వారని తీసుకొచ్చి పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. హైకోర్టులో అసలు ఎవరు కేసు వేశారని ఆయన ప్రశ్నించారు.

కేసుతో సంబంధం లేని ఉద్యోగ సంఘాల నేతలను కోర్టుకు పిలవడం ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో జడ్జిల జీతాలు ఒక్క రూపాయి చేస్తానంటే, న్యాయమూర్తులు ఊరుకుంటారా అని అన్నారు. చింతామణి నాటకం ప్రభుత్వం నిషేధించడాన్ని రఘురామ తప్పుబట్టారు. నాటకాలపై ఆధారపడిన కళాకారుల పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ చేసిన జీవోను వెనక్కి తీసుకోకపోతే కళాకారుల తరఫున తానే పిల్‌ వేస్తానని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

Advertisement

Next Story