40 రజక కుటుంబాల గ్రామ బహిష్కరణ.. వాళ్లు చేసిన తప్పేంటో తెలుసా?

by GSrikanth |
40 రజక కుటుంబాల గ్రామ బహిష్కరణ.. వాళ్లు చేసిన తప్పేంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లా జి.సిగడాం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని బాతువ గ్రామంలో 40 రజక కుటుంబాలను గ్రామస్తులు బహిష్కరించారు. కులవృత్తి ధరలు పెంచాలని గతకొన్ని రోజులుగా గ్రామంలో రజకులు ఆందోళన చేస్తున్నారు. ధరలు పెంచకపోతే కులవృత్తి పనులు మానేస్తామని వ్యాఖ్యానించారు. దీంతో రజకులపై గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజకులకు గ్రామంలో ఎలాంటి సహాయం చేయవద్దని గ్రామ పెద్దలు దండోరా వేయించారు. అన్ని విషయాల్లో గత రెండ్రోజులుగా గ్రామస్తులు రజకులను ఇబ్బందులు పెడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story