- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Vijayawada: బెజవాడలో కనిపించని పండుగ వాతావరణం
దిశ, డైనమిక్ బ్యూరో: తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జనజీవనం స్థంభించిపోయింది. దీంతో విజయవాడ సహా బుడమేరు పరిసర గ్రామాల ప్రజలు ఈ ఏడాది వినాయక చవితి పండుగకు దూరంగా ఉన్నారు. ప్రతి ఏడాది విజయవాడలో గణేష్ చతుర్థి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. దుర్గమ్మ సన్నిధిలో పెద్ద విగ్రహాన్ని పెట్టి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేగాక విజయవాడ పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేసి నిమజ్జనం రోజున అన్ని ప్రకాశం బ్యారేజీ వద్దకు ఊరేగింపుగా తీసుకొస్తారు. కానీ ఈ సంవత్సరం వరద నింపిన విషాదంతో పట్టణంలోనే గాక బుడమేరు పరిసర ప్రాంతాల్లో కూడా పండుగ వాతావరణం కనిపించడం లేదు.
కాగా విజయవాడలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. వరదల వల్ల బుడమేరు పొంగడంతో కట్టకు మూడు గండ్లు పడి విజయవాడ సహా చాలా గ్రామాలు నీట మునిగాయి. ప్రభుత్వం రాత్రింబవళ్లు నిరంతరాయంగా శ్రమించి గండ్లను పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చి, మూడో గండిని పూడ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం బుడమేరు కాస్త శాంతించడంతో విజయవాడకు వరద తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ నందివాడ మండలంలో 12 గ్రామాలు జలదిగ్భందనంలో మునిగి ఉన్నాయి. ఆయా గ్రామాలకు ప్రభుత్వం పడవల ద్వారానే ఆహారం, ఇతర సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తోంది.