వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి బెజవాడ అధ్యక్షుడు

by srinivas |   ( Updated:2024-01-17 11:36:02.0  )
వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి బెజవాడ అధ్యక్షుడు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ ఇంచార్జుల మార్పులు, చేర్పులతో అసంతృప్త ఎమ్మెల్యేలు, నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. సిట్టింగుల స్థానంలోనూ కొత్త ఇంచార్జులను నియమించడంతో ఆ పార్టీలో భారీ కుదుపు కొనసాగతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బె చెప్పారు. తాజాగా బెజవాడ తూర్పు వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీ నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ మేరకు సైకిల్ ఎక్కేందుకు లైన్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలో కలిశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కేశినేని చిన్ని సమక్షంలో నారా లోకేశ్‌తో భేటీ అయి సీటు విషయమై చర్చించారు. త్వరలో తాను టీడీపీలో చేరతానని లోకేశ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భవకుమార్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

కాగా రెండు వారాలుగా విజయవాడలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్ధం కావడంలేదు. నిన్నటి వరకూ ఓ పార్టీలో ఉన్న నేతలు ఇవాళ మరో పార్టీతో టచ్‌లోకి వెళ్లిపోతున్నారు. దీంతో ఎన్నికలకు ముందే బెజవాడ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Advertisement

Next Story