- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Y. S. Sharmila : షర్మిలపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జగన్ తో షర్మిల రాజకీయంగా విభేదించిన మాట వాస్తవమే అన్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తాము ఏమీ అనలేదన్నారు. ఏపీకి వచ్చి కాంగ్రెస్ లో చేరడం షర్మిల చేసిన రాజకీయ తప్పిదం అని అభిప్రాయపడ్డారు. షర్మిల వెనకు ఎవరున్నారో అందరికీ తెలుసు అన్నారు.
ఎన్డీఏలో చేరికపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఎన్డీఏలో చేరాలని వైసీపీకి 2014లోనే ఆఫర్ వచ్చిందన్నారు. మేం వద్దన్నాకే బీజేపీ, టీడీపీతో జతకట్టిందని స్పష్టత ఇచ్చారు. వైసీపీ ఏ పార్టీతో జత కట్టదన్నారు. అంశాలవారీగానే గతంలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడు కూడా మేం కాదంటేనే టీడీపీతో బీజేపీ జట్టుకట్టిందని కుండబద్ధలు కొట్టారు. వాలంటీర్లు తమ కార్యకర్తలని తాను అనలేదని.. తమ ప్రభుత్వం నియమించిన వారు అనే చెప్పానని గుర్తు చేశారు. వాలంటీర్లలో చాలామంది వైసీపీ అభిమానులుగానే ఉంటారన్నారు.