- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: బీజేపీకి బానిసలుగా మారిన ప్రతిపక్షాలు.. వైస్ షర్మిల ఫైర్
దిశ డైనమిక్ బ్యూరో: ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల ప్రతిపక్షాలపై ట్విట్టర్ (X) వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో బాగంగా వామపక్షాలతో పొత్తు, కలిసి పోరాడే అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. కలిసికట్టుగా పోరాటాలు చేస్తే ఏదైనా సాధ్యమని పేర్కొన్న ఆమె.. ఉమ్మడి కార్యాచరణ, సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్రంలోని అధికార , ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారి మన హక్కులను కాలరాస్తున్నాయని పోస్ట్ ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మేలు జరగాలన్నా.. విభజన హామీలు నెరవేరాలన్నా.. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాసుకుకొచ్చారు. ఇక ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జోష్ పెంచిన షర్మిల అటు పాలకపక్షాన్ని ఇటు ప్రతి పక్షాలను ఏకిపారేస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రయాణంలో బాగంగా వామపక్షాలతో పొత్తు, కలిసి పోరాడే అంశాలపై చర్చ జరిగింది. కలిసికట్టుగా పోరాటాలు చేస్తే ఏదైనా సాధ్యం. ఉమ్మడి కార్యాచరణ, సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలోని అధికార ,… pic.twitter.com/fHn3wul3tv
— YS Sharmila (@realyssharmila) February 23, 2024