జగన్ ఇన్ని సీట్ల మెజారిటీతో గెలుస్తాడు.. ముందే చెప్పేసిన వేణుస్వామి!

by Anjali |   ( Updated:2024-03-25 15:00:32.0  )
జగన్ ఇన్ని సీట్ల మెజారిటీతో గెలుస్తాడు.. ముందే చెప్పేసిన వేణుస్వామి!
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి సుపరిచితమే. తరచూ రాజకీయ నాయకులపై, సెలబ్రిటీలపై కాంట్రావర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ ఈయన చెప్పిన జాతకం పలుమార్లు నిజం అవ్వడంతో వేణు స్వామి ఏం చెప్పినా జనాలు ఆందోళన చెందుతుంటారు. టాలీవుడ్ హీరో ప్రభాస్ ఆరోగ్యంపై సైతం ఆయన జోస్యం చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే రెబల్ స్టార్ ఏదో హెల్త్ ఇష్యూతో బాధపడుతోన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఇక, గతంలో సమంత-నాగచైతన్య విడిపోతారని బాంబ్ పేల్చాడు. నిజంగానే సామ్-చై విడిపోయారు. రాజకీయ నాయకుల పరంగా చూసుకున్నట్లైతే.. వేణుస్వామి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కింద ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తుందని చెప్పాడు. ఈయన చెప్పినట్లుగానే కవిత రీసెంట్‌గా అరెస్టు అయ్యారు. తర్వాత కాస్త ఆలస్యమైన కేసీఆర్ కూడా జైలుకు వెళ్తాడని చెప్పి.. బీఆర్‌ఎస్ పార్టీకి మరో టెన్షన్ పెట్టాడు.

ఇకపోతే వేణుస్వామి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపై కామెంట్లు చేశాడు. ‘‘2024 లో అసెంబ్లీ ఎలక్షన్స్‌లో తప్పకుండా జగన్ విజయం సాధిస్తాడు. 175 స్థానాల్లో 135 సీట్ల మెజారిటీతో గెలుస్తాడు. ఇప్పుడే కాదు.. 2029లో జరిగే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే గెలుపొందుతాడు. భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీ కనుమరుగైపోతుంది. ఇక షర్మిల, జగన్ పక్కన ఉండి ఉంటే.. రాజకీయ ప్రస్తావం తనకు దక్కేదని, కానీ ఇప్పుడు ఆమెకు పాలిటిక్స్ కలిసి రావని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.

Read More..

‘ఖబడ్దార్.. ఇక మీ ఆటలు సాగవు’.. YCP నేతలకు చంద్రబాబు మాస్ వార్నింగ్

Advertisement

Next Story