- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే.. ఎక్కడ చూసిన సమస్యలే..
దిశ వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంగండ్ల రాము ఈ రోజు గుడివాడలోని 32వ వార్డులో పర్యటించారు. పార్టీ అనుచరులతో కలిసి బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తాను ప్రస్తుతం 32వ వార్డులో పర్యటింస్తున్నాని.. అనీ వార్డుల్లాగానే, గ్రామాల్లాగానే ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎక్కడ చూసిన తట్టుకోలేనన్ని సమస్యలు ఉన్నాయని.. ఇక డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉందని, చాల రోడ్లు ఆగిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో వేసిన రోడ్లు నేటీకి దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు.
తాను నియోజకవర్గంలో ఎక్కడ తిరిగిన ఆ రోడ్డు టీడీపీ వేసిందే అని ప్రజలు చెపుతున్నారని అన్నారు. ఇక మంచి నీళ్లకు కోసం ప్రజలు చెప్పలేనన్ని కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శుభ్రమైన నీరు, చక్కనైన రహదారులు కలిగి ఉండడం ప్రజల హక్కు అని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. కానీ ప్రస్తుతం ప్రభుత్వ వ్యవస్థ దారుణంగా తయారైందని మండిపడ్డారు.
అసలు వ్యవస్థలన్నీ ఏమైపోయాయి.. ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేమంటే ప్రజలకు పథకాలను ఇస్తున్నాను మీకేం అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటరాని.. అప్పడు చంద్రబాబు హయాంలో కూడా పథకాలు ఇచ్చారని.. అయినా అభివృద్ధి జరిగిందని తెలిపారు.
ఇక కొత్తగా తీసుకువచ్చిన పథకం ఏమి లేదని అన్నీ ఎప్పటి నుండో అమలులో ఉన్న పథకాలే అనే విషయాన్నీ జగన్ గుర్తుపెట్టుకోవాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More..
సీనియర్‌గా సీటు ఆశించా.. అసంతృప్తి లేదు: బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి