- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ఎమ్మెల్యేపై డీజీపీకి Varla Ramaiah ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో : కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి ఫిర్యాదు చేశారు. దళిత యువకుడు పైడి హర్ష ఆత్మహత్యకు ప్రతాప్ కుమార్ రెడ్డి వేధింపులే కారణమని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి వేధింపులతో నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర బాధపడుతున్నారని ఆరోపించారు. నెల్లూరు దళితులు నారాయణ, కరుణాకర్, అనుష్కల మరణాలు మరువక ముందే ఇంకో దళితుడి ఆత్మహత్య ప్రయత్నం కలచివేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో వైసీపీ నాయకులు దళితులపై రెచ్చిపోయి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 'హర్షను వైసీపీలో చేరాలంటూ ప్రతాప్ కుమార్ రెడ్డి వేధించాడు. వైసీపీలో చేరేందుకు నిరాకరించడంతో పోలీసులతో కలిసి ఎమ్మెల్యే హర్షపై తప్పుడు కేసులు బనాయించాడు.
పార్టీలో చేరకుంటే పోలీసులతో ఎన్ కౌంటర్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో బయపడిన హర్ష పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దళిత యువకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి. ఎమ్మెల్యేతో కుమ్మక్కై హర్షపై తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై విచారణ చేసి చర్యలు తీసుకోండి. తమరు తీసుకుని సత్వర చర్యలు బాధితులకు భరోసా కల్గించి ప్రజలలో పోలీసులపై నమ్మకం ఏర్పడుతుంది. నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయండి'అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read...