వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం ఫిక్స్: ఎప్పుడంటే!

by Seetharam |
వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం ఫిక్స్: ఎప్పుడంటే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహానికి ముహూర్తం కుదిరింది. ఇటీవలే నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జక్కం అమ్మాని,జక్కం బాబ్జి దంపతుల కుమార్తె పుష్పవల్లి, వంగవీటి రాధాల నిశ్చితార్థం కన్నుల పండువగా జరిగింది. అయితే ఈనెల 22న వీరి పెళ్లికి పెద్దలు ముహూర్తం కుదిర్చారు. అంటే 14 రోజుల్లో ఈ వివాహం జరగనుంది. ఆదివారం రా.7.59 గంటలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు నవ వధువరులు రాధ, పుష్పవల్లిలు ఒక్కటవ్వనున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ వైరల్‌ అవుతుంది. వంగవీటి కుటుంబం అంటే రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి వంగవీటి ఫ్యామిలీ అంటే విపరీతమైన అభిమానం. అంటే ఈపెళ్లి భారీగానే ప్రజలు తరలిరానున్నారు. విఐపీ తాకిడి సైతం ఎక్కువగా ఉండటంత, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో విజయవాడ-నిడమానూరు పోరంకి రోడ్డులోని మురళి రిసార్ట్స్ లో ఈ పెళ్లి వేడుకకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story