వాళ్లు మనుషులా.. పశువులా?.. ట్రోలింగ్స్‌పై Vangalapudi Anitha ఆగ్రహం

by srinivas |   ( Updated:2023-03-09 14:06:29.0  )
వాళ్లు మనుషులా.. పశువులా?.. ట్రోలింగ్స్‌పై Vangalapudi Anitha ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేశ్ యాత్రలో జగన్‌కు అనుకూలంగా ఆమె మాట్లాడారని.. ఇందుకు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసు ఇచ్చారాని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై అనిత స్పందించారు. లోకేశ్ సభలో తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వీడియోను ఎడిట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్న వాళ్లు అసలు మనుషులా, పశువులా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఫేక్ అని కొట్టిపారేశారు.

ట్రోలింగ్‌పై మండిపాటు

ఇక ట్రోలింగ్‌పై కూడా ఆమె మండిపడ్డారు. సీఎం జగన్ కావాలని తాను అన్నట్టుగా ‘ఒకడు తథాస్తు అంటే.. మరొకడు థ్యాంక్యూ అంటీ’ అని ట్రోల్ చేశారని అనిత ధ్వజమెత్తారు. అడవాళ్లు ఇచ్చే గౌరవం ఇదేనా ఆమె నిలదీశారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే చేసిన మంచి పనులు సోషల్ మీడియాలో పెట్టుకోవాలని.. కానీ దుష్ప్రచారం చేయడమేంటని వంగలపూడి అనిత ప్రశ్నించారు.

Also Read...

మంత్రి KTR వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: బాపురావు డిమాండ్

Advertisement

Next Story