- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ గమనాన్ని మార్చిన మహానేత వాజ్‌పేయి: చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయుల్లో వాజ్‌పేయి ఒకరు అని కొనియాడారు. ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత వాజపేయి అని, ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు.
వాజ్‌పేయి పాలనలో ఊపిరిపోసుకున్న టెలికాం, స్వర్ణ చతుర్భుజీ ప్రాజెక్ట్, ఓపెన్ స్కై పాలసీ, సూక్ష్మసేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం, భాగస్వామి కావడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చే అంశాలని గుర్తుచేసుకున్నారు. దేశంలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజ్‌పేయి పాలనలో అభివృద్ధి చేసినవేనని తెలిపారు. ఆ సమయంలోనే జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ తప్పక తలచుకోవాల్సిన దేశభక్తుడు వాజ్‌పేయి అని చంద్రబాబు ట్వీట్ చేశారు.