ఏపీకి కేంద్రం వరాలు.. రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే..!

by srinivas |   ( Updated:2024-07-23 07:55:39.0  )
ఏపీకి కేంద్రం వరాలు.. రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతికి కేంద్రబడ్జెట్‌లో రూ. 15 వేలు కోట్లు కేటాయించడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారన్నారు. ఏపీకి కేంద్రం అండగా నిలబడుతోందని చెప్పారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఏపీని నాశనం చేశారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని, 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో ఏపీ ఒక రాష్ట్రంగా ఉందన్నారు. ఏపీకి కాంగ్రెస్ ఏం చేసిందో అందరికీ తెలుసని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏపీకి జరిగిన నష్టాన్ని మోడీ ప్రభుత్వం పూడ్చే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రానికి ఒక్కొక్కటిగా నిధులు విడుదలవుతున్నాయన్నారు. కేంద్రబడ్జెట్‌ను తాను స్వాగతిస్తున్నానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story