ఏపీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

by srinivas |   ( Updated:2024-02-24 14:03:54.0  )
ఏపీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 27న ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖతో పాటు విజయవాడ, ఏలూరులోనూ రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 27న ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకుని రాష్ట్ర బీజేపీ నాయకులతో భేటీ అవుతారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితులపై వారితో చర్చించనున్నారు. అనంతరం విశాఖ, ఏలూరులో పర్యటిస్తారు. దీంతో రాజ్‌నాథ్ సింగ్ కు రాష్ట్రంలో ఘనంగా స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీగా రావాలని ఇప్పటికే రాష్ట్ర అధిష్టానం పిలుపునిచ్చింది.

Read More..

ప్రకటించిన ఇన్‌చార్జిలు ఫైనల్ కాదు.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story