జగన్ కాళ్లు ఎక్కువగా నాకడం వల్లే ఉండవల్లికి అలా అనిపిస్తోంది: Buddha Venkanna

by Seetharam |   ( Updated:2023-10-15 11:15:06.0  )
జగన్ కాళ్లు ఎక్కువగా నాకడం వల్లే ఉండవల్లికి అలా అనిపిస్తోంది: Buddha Venkanna
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈకేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే చంద్రబాబుకు రిమాండ్ విధించారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తెలీకుండా స్కిల్ స్కాం జరిగింది అంటే ఎవరు నమ్మరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ కాళ్లు ఎక్కువగా నాకడం వలన అందరూ అవినీతి పరుల్లా కనిపించడం సహజమే’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి మేల్ మెనోపాజ్ దశకు చేరుకున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కాం విషయంలో కనీస అవగాహన లేకుండా ఉండవల్లి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉండవల్లి ఆరోపణలు చూస్తుంటే ఆమన మెదడు అరికాల్లోకి జారిందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ తానొక మేధావిననే బిల్డప్ ఇవ్వొద్దంటూ హితవు పలికారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఒక్క రూపాయి అయినా చేరినట్టు కేసు పెట్టిన వాళ్లు అయినా..? మేధావిగా చెప్పుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా నిరూపించే దమ్ముందా అంటూ బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే స్కిల్ స్కామ్ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శనివారం డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే స్కిల్ స్కాం జరిగిందని.. ఇదే విషయాన్ని జీఎస్టీ డీజీ తేల్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.

Advertisement

Next Story