గద్దర్కు ఘనంగా నివాళి

by Javid Pasha |
గద్దర్కు ఘనంగా నివాళి
X

దిశ , గాజువాక: ప్రజా యుద్ద నౌక , గాయకుడు దివంగత గద్దర్ కు ఉక్కు పరి రక్షణ పోరాట కమిటీ ఘన నివాళులు అర్పించింది. మంగళవారం స్టీల్ ప్లాంట్ సెంట్రల్ స్టోర్స్ కూడలి లో స్వర్గీయ గద్దర్ సంతాప సభ జరిగింది. గద్దర్ చిత్రపటానికి ఉక్కు పోరాట కమిటీ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గద్దర్ ప్రజా కళాకారుడిగా ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటారని అన్నారు. తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరి చారని కొనియాడారు .ప్రభుత్వరంగ పరిశ్రమల కార్మికుల సమస్యలపై తన గళాన్ని విప్పి ప్రభుత్వాలకు తెలిసేలా కృషి చేశాడని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉక్కు గుర్తింపు యూనియన్ అధ్యక్షడు కెఎస్ఎన్ రావు , అదనపు ప్రధాన కార్యదర్శి జె.రామ కృష్ణ , పోరాట కమిటీ నాయకులు వై.టి.దాస్, గణపతి రెడ్డి , బి.అప్పారావు, విల్లా రామ్మోహన్ కుమార్, సురేష్ బాబు , కె.పరంధామయ్య జగదీష్ , మహాలక్ష్మి నాయుడు, వి.ప్రసాద్ , వి.ఎస్.పీఎస్సీ , ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి భయ్యే మల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story