- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆత్మసాక్షి సర్వే చెప్పిందేంటి..? టీడీపీ-జనసేన ముందు రెండు వ్యూహలు
ప్రస్తుతానికి టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఉన్నాయి. జనసేనాని బీజేపీతో కటీఫ్ చెబితే వామపక్షాలు కలిసే అవకాశముంది. ఓవైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ బాద్ షాలతో మాట్లాడతానంటున్నారు. ఒకవేళ బీజేపీ కలిస్తే లెఫ్ట్ పార్టీలు పొత్తుకు దూరమవుతాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అమిత్ షా అపాయింట్మెంట్ దక్కలేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఒకడుగు ముందుకేసి లెఫ్ట్ పార్టీలు కలవడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. మరికొద్ది రోజులు చంద్రబాబు జైల్లోనే ఉంటే వైసీపీకి దీటుగా టీడీపీ, జనసేన ఎన్నికల్లో ప్రచారం నిర్వహించగలవా? బీజేపీతో కలుస్తాయా..? లేక వామపక్షాలతో ముందుకు కలిసి సాగుతాయా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో విభజన హామీలు నెరవేర్చకుండా దగా చేసిన పార్టీగా బీజేపీరాష్ట్రంలో విభజన హామీలు నెరవేర్చకుండా దగా చేసిన పార్టీగా బీజేపీముద్ర వేసుకుంది. గడచిన నాలుగున్నరేళ్లలో కేంద్ర సర్కారు మోపిన భారాలతో ప్రజలు ఇప్పటికీ విలవిల్లాడుతున్నారు. కేంద్రంలోని బీజేపీకి వైసీపీ సర్కారు దాసోహమంటూ జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నదనే భావన నెలకొంది. ముస్లిం మైనార్టీ వర్గాలు తీవ్ర అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాషాయ పార్టీతో చెలిమి వల్ల టీడీపీ, జనసేన నష్టపోతాయని ఇటీవల విడుదలైన శ్రీ ఆత్మ సాక్షి సర్వే వెల్లడించింది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ వెనుక సూత్రధారులు కేంద్ర పెద్దలేనని రాష్ట్రమంతా కోడైకూస్తోంది. అయినా టీడీపీ, జనసేనలు కమలనాథుల పట్ల మెతక వైఖరితోనే ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీలతో కలిసే అంశంపై వామపక్షాలు పూర్తి స్థాయిలో స్పష్టతనివ్వడం లేదు.
వైసీపీ చకచకా..
చంద్రబాబుపై వరుస కేసులతో టీడీపీ యంత్రాంగం అతలాకుతలమవుతోంది. మరోవైపు అధికార వైసీపీ జనవరి దాకా పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసింది. సోమవారం విజయవాడలో సీఎం జగన్ ప్రకటించిన నాలుగు కార్యక్రమాల ద్వారా ప్రజలతో నిరంతరం మమేకం కావాలని పిలుపునిచ్చారు. సమాంతరంగా పోల్ మేనేజ్మెంటుపై కసరత్తు చేస్తున్నారు.
ఊగిసలాటకు స్వస్తి చెప్పకపోతే..
ఇలాంటి కీలక సమయంలో బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ పొత్తుల విషయంలో ఓ క్లారిటీకి రావాల్సిన అవసరముందని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ నేతలపై మోపుతున్న కేసుల విషయంలో న్యాయ పోరాటం చేస్తూనే.. ఎన్నికల క్యాంపెయిన్, పోల్ మేనేజ్మెంటు చేపట్టాల్సి ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ ఎన్నికల దాకా వేచి ఉండే ఊగిసలాటకు స్వస్తి చెప్పకుంటే ఇబ్బందులు తప్పవని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
రెండు వ్యూహాలు..
ఈపాటికే టీడీపీ శ్రేణులు బీజేపీ అంటేనే భగ్గుమంటున్నాయి. ఒకవేళ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే సొంత పార్టీ నుంచే సహాయ నిరాకరణ ఎదురయ్యే పరిస్థితులున్నాయి. తెలంగాణలో టీడీపీ పోటీ చేసే స్థానాలను మినహాయించి మిగతా వాటిల్లో కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని అక్కడ పార్టీ సానుభూతిపరులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇండియా కూటమికి, అటు బీజేపీకి తటస్థంగా జనసేన, టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగడమా..? లేక వామపక్షాలను కలుపుకొని పోవడమా? అనేది వీలైనంత త్వరగా తేల్చుకోవాలి. ఈ రెండు వ్యూహాలు మాత్రమే టీడీపీ, జనసేన కూటమిని విజయతీరాలకు చేర్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిపై ఆయా పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేస్తాయా? లేక ఎన్నికల దాకా ఇదే అస్పష్టతను కొనసాగిస్తాయా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.