- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు జాతీకి అంకితం
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రధాని మోడీ ఈ నెల 20 ప్రజలకు అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తిరుపతి-ఐఐటీ, ఐఐఎం-విశాఖ ప్రాజెక్టులను ఈ నెల 20న మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ రెండు విద్యారంగానికి సంబంధించినవి కావడం విశేషం. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఎడ్యుకేషన్ హబ్‌గా గుర్తింపు తెచ్చుకునే ఆస్కారం ఉంది. రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ కేంద్ర గుడ్ న్యూస్ ప్రకటించడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుమని అంటున్నారు.