- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 మంది మంత్రులు ఓడిపోతారు.. జోస్యం చెప్పిన Tulasi Reddy
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం తథ్యమని ఏపీసీసీ మీడియా చైర్మన్ డా.ఎన్ తులసిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 లోక్ సభ స్థానాల్లో గెలిచింది. అయితే ఇండియా టుడే - సీ ఓటర్ తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్‌కు 191 స్థానాల్లో గెలుపొందుతుందని వెల్లడైందన్నారు. దీని బట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకొన్నట్లు తెలుస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు.
రోజు రోజుకు దిగజారిపోతున్న వైసీపీ పరిస్థితి
మరోవైపు రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని తులసిరెడ్డి విమర్శించారు. జనవరిలో ఐ ప్యాక్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర కేబినెట్‌లో ఉన్న 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని, 13 మంది మాజీ మంత్రుల్లో 11 మంది ఓడిపోతారని తేలింది. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తథ్యమని ఏపీసీసీ మీడియా చైర్మన్ డా.ఎన్ తులసిరెడ్డి అన్నారు.