TTD కీలక నిర్ణయ :ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు ఎప్పటినుంచి అంటే?

by samatah |
TTD కీలక నిర్ణయ :ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు ఎప్పటినుంచి అంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి ఒకటో తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి మరియు గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగించనున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed