తిరుమలలో ఈవో శ్యామలరావు తనిఖీలు కంటిన్యూ.. ఈ రోజు ఏం చేశారంటే..!

by srinivas |   ( Updated:2024-06-17 12:07:23.0  )
తిరుమలలో ఈవో శ్యామలరావు తనిఖీలు కంటిన్యూ.. ఈ రోజు ఏం చేశారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఈవో శ్యామలరావు తన మార్క్ పాలన సాగిస్తున్నారు. ఆదివారం సర్వదర్శనం క్యూలైన్లు, తాగునీటి సౌకర్యంపై తనిఖీలు నిర్వహించిన ఆయన శానిటరీ ఉద్యోగులపై సీరియస్ అయ్యారు. సర్వదర్శనం క్యూ లైన్లలో పారిశుధ్య లోపంపై ఆగ్రహం అయ్యారు. ఇద్దరు శానిటరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అయితే సోమవారం సైతం తిరుమలలో తనిఖీలను కొనసాగించారు. భక్తులతో కలిసి నిత్యాన్నదానంలో పాల్గొన్నారు. ప్రసాదం రుచి నాణ్యత, వసతులపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాఖల వారిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భక్తుల సౌకర్యాల విషయంలో వెనకడు వేయమని చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తిరిగి వేళేటప్పుడు ఆనందం వ్యక్తం చేసేలా సేవలు అందిస్తామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.

Advertisement

Next Story