- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజం గెలవాలి బస్సు యాత్ర..వైసీపీ అరాచకాలకు అంతిమఘట్టం: నిర్మాత అశ్వనీదత్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్ అన్నారు. ఈ యాత్రకు వచ్చిన ప్రజాస్పందన చూస్తుంటే నిజం నిజంగానే గెలిచింది అన్నట్లు ఉందని అన్నారు. ఈ యాత్ర ప్రజా వ్యతిరేక అరాచకాలకు అంతిమఘట్టం అని అన్నారు. చంద్రబాబు రేపటి విజయానికి హృదయపూర్వక ఆహ్వాన పర్వం అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అశ్వనీదత్ ట్వీట్ చేశారు.‘మా ఆత్మీయ సోదరీమణి, అనుంగ ఆడపడుచు నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రకు లభిస్తున్న గొప్ప స్పందన చూస్తుంటే నిజంగానే నిజం గెలిచి అది ప్రజావిజయ విజయభేరి మోగించడానికి దగ్గరలోనే ఉందనే నమ్మకం కలిగింది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రపంచ వ్యాప్త వ్యతిరేక జ్వాలలు ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా దహించక మానవు. ఈ యాత్ర ప్రజావ్యతిరేక అరాచకాలకు అంతిమఘట్టం. చంద్రబాబు రేపటి విజయానికి హృదయ పూర్వక ఆహ్వాన పర్వం’ అని అశ్వనీదత్ తన సందేశాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు.