- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Trending: దయచేసి బెట్టింగ్ కాయొద్దు..! నెట్టింట్లో వైరల్ అవుతున్న పిఠాపురం మెజారిటీ లెక్క
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం ఓ రికార్డును క్రియేట్ చేసింది. నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 86.63 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీగా ఓట్లు పోలయ్యాయి. కాగా, పిఠాపురం నుంచి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేశారు. ఈ తరుణంలో భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసొస్తుందోనని నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే నియోజవర్గానికి సంబంధించి మెజారిటీ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అందులో నియోజవర్గంలో 2,38,000 ఓట్లు ఉండగా.. 2,04,800లో పోల్ అయినట్లుగా ఉంది. అదేవిధంగా కాపు ఓట్లు 65,300 పోట్లు పోల్ కాగా..16,325 ఓట్లు వంగా గీతకు, 48,975 ఓట్లు పవన్ వస్తాయని అందులో ఉంది. ఇక బీసీల ఓట్లు 81,700 ఓట్లు పోల్ కాగా.. 45,000 ఓట్లు గీతకు, 36,700 పవన్‌కు వస్తాయని ఉంది. మొత్తానికి నియోజకవర్గంలో వంగా గీతకు 1,05,575 ఓట్లు, వపన్‌కు 98,935 ఓట్లు వస్తాయని.. 6,640 ఓట్ల మెజారిటీతో వంగా గీత గెలుపు ఖాయమని ఆ లెక్కల్లో ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన కాపీని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది విపరీతంగా వైరల్ అవుతోంది.