Trending: పోలీసుల ఎదుటే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన మందుబాబులు.. వీడియో వైరల్

by Shiva |
Trending: పోలీసుల ఎదుటే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన మందుబాబులు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇష్టమైన బ్రాండ్లు అన్ని ఒక్కసారిగా రోడ్డు మీద కనిపిస్తే మందుబాబులకు పండగే. తాజాగా, పోలీసుల ఎదుటే మద్యం బాటిళ్లను మందుబాబులు అందినకాడికి ఎత్తుకెళ్లిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన రూ.50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే అక్కడే ఉండి కాపు కాసిన కొందరు మందుబాబులు ఎగబడి మద్యం సీసాలను ఎత్తుకుని పరుగులు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టి మద్యం సీసాలను ధ్వంసం చేశారు.

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/TeluguScribe/status/1833183660473811369

Advertisement

Next Story

Most Viewed