AP Politics:పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు.. స్పష్టం చేసిన పార్టీ నేత

by Jakkula Mamatha |
AP Politics:పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు.. స్పష్టం చేసిన పార్టీ నేత
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడపలో రెండు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ(YCP) ఘోర ఓటమి చెందింది అని.. దీనికి గల కారణాలు వైఎస్ జగన్(YS Jagan) ఇప్పటికే పార్టీ కార్యకర్తలతో చర్చించారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. దీంతో ఎన్నికల అనంతరం పార్టీ బలోపేతంపై దృష్టి సారించాం అన్నారు. జిల్లా(District), మండల(Mandal) స్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టుల్లో నియామకాలు(Appointments to posts) చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీలో అవసరమైన మార్పులు చేర్పులు జగన్ దృష్టికి తీసుకుని వెళతామన్నారు.

ఈ క్రమంలో పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి దారుణంగా ఉందని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బోట్లు కొట్టుకుని బ్యారేజీకి ఇబ్బంది ఏర్పడితే.. దాన్ని కూడా వైసీపీ పై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మేం రైతు బోరోసా కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకున్నామని.. కానీ నేడు క్రాప్ ఇన్సూరెన్స్(Crop Insurance) కూడా రైతులే కట్టుకోవాలని నిర్ణయించారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరు వేల కోట్ల కరెంట్ చార్జీలు పెంచడానికి సిద్ధమై.. కరెంట్ చార్జీల(Current charges)పెంపు గత ప్రభుత్వంలో జగన్ వల్ల అని విష ప్రచారం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు.

Advertisement

Next Story

Most Viewed