- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇవాళ సాయంత్రం ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నేతలు వచ్చేనా..?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన ఖరారైంది. మంగళవారం సాయంత్రం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో బుధవారం ఢిల్లీ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ ధర్నాలో బీఎస్పీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్(BRS) తదితర పార్టీల నేతలు పాల్గొనున్నారు. స్థానిక ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (Reservation) కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా (Maha Dharna) చేపట్టారు.
ఈ మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్, వామపక్షాలు, టీజేఎస్‌తోపాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వెళుతున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖా, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు హజరుకానున్నారు.