- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అపార్ట్మెంట్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య.. అసలు కారణం అదే
by Sumithra |

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్ మోర్ (పెర్కిట్) ఏరియాకు చెందిన చిట్యాల రాజన్న-మంజుల దంపతుల మూడో కుమార్తె చిట్యాల నీత (17) బుధవారం రాత్రి మహాలక్ష్మి అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల నీత ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలోని క్షత్రియ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసిస్తుందన్నారు. బుధవారం రాత్రి నీత వారి బాబాయ్ చిట్యాల మహేష్ ఇంటికి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిందన్నారు. అక్కడే తీవ్రమైన కడుపునొప్పి రావడంతో భరించలేక అపార్ట్మెంట్లోని ఐదవ అంతస్తుకు ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. అపార్ట్మెంట్ పై నుంచి నీత దూకిన సమాచారం తెలుసుకుని వెంటనే ఆమెను ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు.
Next Story