కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై బూతులతో విరుచుకుపడ్డ అంజన్ కుమార్ యాదవ్

by Mahesh |   ( Updated:2025-04-21 12:55:07.0  )
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై బూతులతో విరుచుకుపడ్డ అంజన్ కుమార్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ హెరాల్డ్ (National Herald ) కేసులో కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో ఈడీ (ED) చేర్చింది. దీనిని కక్ష సాధింపుగా పేర్కొంటూ.. ఈడీ నిర్ణయాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు నిరసన (protest) వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనలకు రెండు రోజుల క్రితం పిలుపు నివ్వగా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని "గాం**" బూతులతో విరుచుకుపడ్డాడు.

అక్రమ సంపాదన నేపథ్యంలో చార్జిషీట్ లో పేరును ఈడీ (ED) చేర్చిందని, అవినీతి చేసిన నేతలకు సపోర్టుగా నిరసనలు చేయడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) మాట్లాడుతూ.. కిషన్ రెడ్డిని బూతులు తిట్టారు. ఈ వీడియో (video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియాలో టీపీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో కేంద్ర మంత్రిని బూతులు తిట్టడం స్పష్టంగా కనిపించింది. కాగా కేంద్రమంత్రిని బూతులు తిడుతుంటే అక్కడి నేతలు ఈలలు వేశారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను నెటిజన్లు ఖండిస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/1912772718518210697



Next Story