Congress list: మహారాష్ట్రలో కాంగ్రెస్ రెండో జాబితా.. 23 మంది అభ్యర్థులకు చాన్స్

by vinod kumar |
Congress list: మహారాష్ట్రలో కాంగ్రెస్ రెండో జాబితా.. 23 మంది అభ్యర్థులకు చాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రెండో జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదల చేసింది. ఈ లిస్టులో 23 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. కాంగ్రెస్(congress), శివసేన యూబీటీ మధ్య వివాదంగా మారిన నాగ్‌పూర్ సౌత్ సీటు కాంగ్రెస్‌కు దక్కగా.. ఈ నియోజకవర్గం నుంచి గిరీష్‌ కృష్ణరావు పాండవ్‌(girish krishna rao pandav)ను బరిలోకి దింపింది. తాజా జాబితాలో ముగ్గురు మహిళా నేతలకు సైతం చాన్స్ దక్కింది. జల్‌గామ నుంచి మహిళా నేత స్వాతి సందీప్ వాకేకర్(swati sandeep), బాంద్రా సెగ్మెంట్‌లో పూజా గణేష్ తవ్ కర్‌, నాగ్‌పూర్ జిల్లాలోని సావ్నర్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత సునీల్ కేదార్ భార్య అనూజ(Anooja) బరిలోకి దింపింది. ఇక, వార్థా నుంచి శేఖర్ ప్రమోద్ బాబు షిండే, జల్నాలో సీనియర్ నేత కైలాస్ కిషన్ రావ్, సిరొల్ నియోజకవర్గం నుంచి గణపతిరావ్ అప్పా సాహిబ్ పాటిల్‌లకు అవకాశం ఇచ్చింది.

ఈ నెల 24న రిలీజ్ చేసిన కాంగ్రెస్ తొలి జాబితాలో 48 మంది పేర్లను ప్రకటించింది. ఆ పార్టీ ఇప్పటి వరకు 71 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 288 స్థానాలకు మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి సీట్ షేరింగ్‌లో భాగంగా హస్తం పార్టీ 85 స్థానాల్లో పోటీ చేస్తోంది. దీంతో మరో 14 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎంవీఏ(mva) కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని త్వరలోనే తమ భాగస్వామ్య పక్షాల మధ్య తుది విడత సీట్ల పంపకం జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed