- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector Sandeep Kumar Jha:పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వండి
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా సకాలంలో అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jha)అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమలు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో శనివారం డీఏపీసీ- టీఎస్ ఐ పాస్, టీ ప్రైడ్ (Review of DAPC TSI Pass,T Pride)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో, అనుమతి కోసం ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో, ఏ కారణాలతో నిలిచిపోయాయో ఆయా శాఖల ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
డీఏపీసీ- టీఎస్ ఐ పాస్ కింద పీసీబీ -2, సెస్, ఫ్యాక్టరీస్, నీటి పారుదల శాఖ వద్ద ఒక్కో అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి జీఎం ఇండస్ట్రీస్ గణేష్ రాం తీసుకెళ్లారు. టీ ప్రైడ్ కింద ఎస్సీ లకు 21, ఎస్టీలకు 19, దివ్యాంగులకు ఒకటి, పావలా వడ్డీ కింద 2 యూనిట్స్ మంజూరయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ ఏడీ భారతి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్డీఎం మల్లికార్జున్, జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, సెస్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, డీటీసీపీఓ అన్సార్, లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, డీటీడీఓ జనార్ధన్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.