వివాహ విందు భోజనాల్లో విషాదం.. మహిళ మృతి, పలువురికి అస్వస్థత

by srinivas |
వివాహ విందు భోజనాల్లో విషాదం.. మహిళ మృతి, పలువురికి అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరులో విషాదం చోటు చేసుకుంది. వివాహ విందు భోజనాలు వికటించి మహిళ మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. మృతురాలు మందస మండలానికి చెందిన బేతాళపురం గ్రామానికి చెందిన తెప్పల జానకమ్మ(35)గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో అస్వస్థకు గురైన మిగతా పదిమందిని చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. విందు భోజనం నిర్వహించిన వారి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story