- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరు జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో దంపతులు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా తోటపల్లి మండలం చిన్న చెరుకూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి చెందారు. మృతులు నరసయ్య, భాగ్యమ్మగా గుర్తించారు. నరసయ్య కల్లుగీత కార్మికుడు. ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఆఫ్ చేసేందుకు యత్నించారు. అయితే ఆయనకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో నరసయ్య అక్కడే కుప్పకూలిపోయారు. ఎంతకీ భర్త నరసయ్య బయటకు రాకపోవడంతో భార్య వెళ్లి లేపే ప్రయత్నం చేశారు. ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు అక్కడే పడిపోయారు. కరెంట్ షాక్‌తో తల్లిదండ్రులు మృతి చెందారని గమనించిన వారి కుమారుడు కరెంట్ బోర్డులో మెయిన్ స్వీచ్ ఆఫ్ చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story