- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan : కీలకం: చంద్రబాబు నాయుడుతో రేపు పవన్ కల్యాణ్ ములాఖత్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈనెల 14న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో భాగంగా పవన్ కల్యాణ్ కలిసి పరామర్శించనున్నారు. అంతేకాదు తాను ఉన్నానంటూ చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఓ భరోసా ఇవ్వనున్నారు. ఈ మేరకు జైలు అధికారులకు నేతలు దరఖాస్తు చేశారు.
అయితే సమయం అనేది ఖరారు చేయాల్సి ఉంది. చంద్రబాబు నాయుడుకు వారంలో రెండు సార్లు మాత్రమే ములాఖత్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మంగళవారం నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిలు చంద్రబాబుతో ములాఖత్‌లో భాగంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ చర్యలను వ్యతిరేకిస్తూ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీకి వెళ్లాలంటే పాస్ పోర్టు కావాలా అని ప్రశ్నించారు. అనంతరం రోడ్డుపై పడుకుని తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు పవన్ కల్యాణ్. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ పిలుపునిచ్చిన బంద్‌కు సైతం పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఈ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులకు సైతం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 14న పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.