ఏపీ మద్యంపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సెటైర్లు.. (వీడియో)

by Hamsa |   ( Updated:2023-09-13 05:53:23.0  )
ఏపీ మద్యంపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సెటైర్లు.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, శ్రీకాంత్ ఏపీ మద్యం పై సెటైర్లు వేస్తూ ఓ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ‘‘ఈరోజు బెజవాడలో ఉన్నా.. డిప్రెషన్ లో ఉండి బీర్ తెచ్చుకున్నా. ఇది మామూలు బీర్ కాదు.. ఇంట్లో కూడా చెప్పలేదు.. తాగితే ఏమవుతుందో తెలియదు.. నన్ను గుర్తుపెట్టుకోండి. శ్రీకాంత్ అయ్యంగార్ కాదు శ్రీకాంత్ భారత్’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఏపీ ప్రభుత్వం బూమ్ బూమ్ బీర్‌ను చూపిస్తూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీకాంత్ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story