నేటి నుండి అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వేట.. మొదటి దరఖాస్తు ఎవరిదంటే..?

by Indraja |   ( Updated:2024-01-24 07:22:55.0  )
నేటి నుండి అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వేట.. మొదటి దరఖాస్తు ఎవరిదంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటా పోటీగా ముందుకెళ్తున్నాయి. అయితే తాజాగా ఈ జాబితా లోకి కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి చేరింది. నిన్నటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా బరిలో దూకింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో చట్ట సభల్లో ప్రాతినిధ్యం సాధించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రస్ పార్టీ అభ్యర్థుల వేటను మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చెయ్యాలని ఆశపడే అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు (బుధవారం) నుండి జయవాడ లోని ఆంధ్రరత్న భవన్‌లో అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించనుంది. కాగా ఈ ధరకాస్తులను ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ స్వీకరించనున్నారు. కాగా మొదటి దరఖాస్తును కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వనున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్‌లో చేరిన వారికి కూడా అప్లికేషన్లు ఇచ్చేలా.. ఏపీ కాంగ్రెస్ సభ్యత్వమే అభ్యర్ధి మొదటి అర్హత అని ప్రకటించారు.

ఈ అంశం పై గతంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లడుతూ.. దరఖాస్తుల స్వీకరణ అనంతరం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లోని మాజీ నేతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా కాంగ్రెస్ మాజీ నేతలకు తిరిగి పార్టీ లో చేరాల్సిందిగా వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. దీనితో వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది.

Advertisement

Next Story