- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirupati: వేగంగా వెళ్తున్న కారు నుంచి కిందపడిన పార్శిల్స్.. తీసి చూస్తే..!
దిశ, వెబ్ డెస్క్: గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా అక్రమ తరలింపు కొనసాగుతోంది. పోలీసుల తనిఖీలు, చెకింగ్ పాయింట్లను తప్పించుకుని యదేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన ఘటన పోలీసులకు సవాల్ విసిరింది. గాదెంకి టోల్ ప్లాజా వద్ద ఓ కారు అతివేగంగా రోడ్డుపై ప్రయాణించింది. టోల్ ప్లాజాను దాటి వెళ్తుండగా సడెన్‌గా బ్రేకర్ వచ్చింది. అయితే డ్రైవర్ కారు బ్రేక్ వేయకుండా అంతేవేగంగా నడిపారు. స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేసే సమయంలో కారు డిక్కీ ఓపెన్ అయ్యి కొన్ని ప్యాకెట్లు కిందపడ్డాయి. అయినా కారు వేగంగా వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు టోల్ ప్లాజా సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.
అయితే కిందపడిన ప్యాకెట్స్‌ను టోల్ ప్లాజా సిబ్బంది పరిశీలించారు. ప్యాకెట్లలో గంజాయి కుక్కి ఉండటంతో నిర్ఘాంతపోయారు. వెంటనే హైవే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ ఫుటేజులను పరిశీలించిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. అయితే కారులో ఇంకా ఎంత గంజాయి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘గంజాయి ఎక్కడికి సరఫరా అవుతుంది. ఎవరికి అందజేస్తున్నారు. కారు ఓనర్ ఎవరు. కారులో ఎంత మంది ఉంటారు.’’ అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.