తిరుపతి: ఈ నెల 12న బ్రేక్ దర్శనాలు రద్దు

by Seetharam |
తిరుపతి: ఈ నెల 12న బ్రేక్ దర్శనాలు రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమలలో దీపావళి సందర్భంగా ఈ నెల 12న బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీపావళి రోజున శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఆస్థాన స్వామికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద సమర్పణతో దీపావళి ఆస్థానం ముగియనుంది అని ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా తిరుమలలో కేవలం ప్రోటోకాల్ దర్శనాలను మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఇకపోతే నవంబరు 11న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

Advertisement

Next Story