మిర్చి పంటకు నిప్పంటించిన దుండగులు.. 50 క్వింటాళ్ల మిర్చి దగ్ధం

by Ramesh Goud |
మిర్చి పంటకు నిప్పంటించిన దుండగులు.. 50 క్వింటాళ్ల మిర్చి దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో మిర్చి పంటకు నిప్పంటుకొని దాదాపు 50 క్వింటాళ్ల మిర్చి దగ్దం అయ్యింది. ఘటన ప్రకారం పల్నాడు జిల్లా (Palnadu District) కారంపూడి మండలం (Karampudi Mabndalam) లక్ష్మీపురంలో (Lakshmipuram) వజ్రాల సురేష్ రెడ్డి అనే రైతు తన పొలంలో పండిన మిర్చి పంటను (Red Chilli) పొలంలోనే కుప్ప చేసి ఉంచాడు. మంచి ధర వచ్చినప్పుడు అమ్మేందుకు సిద్దంగా ఉంచాడు. బుధవారం రాత్రి సురేష్ రెడ్డి పొలం వద్దకు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.. కుప్పగా ఉన్న మిర్చికి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న బాధిత రైతు పొలానికి చేరుకునే లోపు మంటలు పూర్తిగా వ్యాపించి, మిర్చి మొత్తం దగ్దమైంది (Burnt). ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. దీనిపై బాధిత రైతు సురేష్ రెడ్డి స్పందిస్తూ.. 50 క్వింటాళ్ల మిర్చి మంటల్లో దగ్ధమైందని, దీంతో 6 లక్షల వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story