- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరైన పులివెందులకు ఆ ముగ్గురు వ్యక్తులు
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాయలంలో పలువురిని సీబీఐ విచారించింది. పులివెందులకు చెందిన నాగెళ్ల విశ్వేశ్వర్ రెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులను సీబీఐ విచారించింది. ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు వీరికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిని సీబీఐ విచారించింది. వివేకా హత్యకేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురుతో ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు సీబీఐ గుర్తించింది. ఈనేపథ్యంలో హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. వివేకా హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నారు? ఉదయ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో అత్యధికంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది..? ఎంపీ అవినాశ్ రెడ్డితో వారికి ఉన్న సంబంధాలపై సీబీఐ అడిగి తెలుసుకుంది. ఈ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి సైతం హాజరుకావాల్సి ఉంది. అయితే నాలుగు రోజులు గడువు కోరిన నేపథ్యంలో సీబీఐ ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read..