మంత్రి రోజా నుంచి ప్రాణహాని.. డీజీపీకి ప్రేమ జంట ఫిర్యాదు

by Seetharam |   ( Updated:2023-11-16 09:38:08.0  )
మంత్రి రోజా నుంచి ప్రాణహాని.. డీజీపీకి ప్రేమ జంట ఫిర్యాదు
X

దిశ , డైనమిక్ బ్యూరో : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాపై ఓ ప్రేమ జంట సంచలన ఆరోపనలు చేసింది. మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళణ వ్యక్తం చేసింది. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీలు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం ప్రవీణ తల్లిదండ్రులకు తెలిసింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రవీణ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అంతేకాదు ప్రవీణకు పెళ్లి చేసేందుకు సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ప్రియుడు జిలానీని విడిచిపెట్టి ఉండలేకపోయిన ప్రవీణ ఇటీవలే ఇంటి నుంచి వెళ్లిపోయింది. నెల్లూరులోని తన ప్రియుడు జిలానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తర్వా త ప్రవీణ కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ప్రవీణ, జిలానీలు పోలీసులను ఆశ్రయించారు. అయితే తాము పోలీసులను ఆశ్రయించినా తమకు రక్షణ కల్పించకుండా మంత్రి ఆర్‌కే రోజా వారిపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేసి వారికి రక్షణ కల్పించాలని ప్రేమ జంట డిమాండ్ చేశారు.

Advertisement

Next Story