ఇద్దరు టీడీపీ సీనియర్లకు షాక్... పార్టీ కండువాలు దహనం

by srinivas |   ( Updated:2024-03-22 15:25:13.0  )
ఇద్దరు టీడీపీ సీనియర్లకు షాక్... పార్టీ కండువాలు దహనం
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మూడో జాబితాలోనూ ఆ ఇద్దరు సీనియర్లకు షాక్ తగిలింది. దీంతో అనుచరులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, అధినేత బ్యానర్లు దహనం చేస్తున్నారు. ఈ ఘటన కృష్ణా, గుంటూరు జిల్లాలో జరిగింది.

కృష్ణా జిల్లా మైలవరం ఇంచార్జి దేవినేని ఉమకు టీడీపీ జాబితాలో భారీ షాక్ తగిలింది. ఈ స్థానం నుంచి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కే మరోసారి సీటు దక్కింది. దీంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన దేవినేని ఉమకు ఆశభంగం కలిగింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా అసంతృప్తి రగిలింది. దేవినేని ఉమతో భేటీ అయి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

అటు గుంటూరు జిల్లా తెనాలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజా పోటీ చేయాలని భావించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు భారీగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేశారు. అయితే పొత్తులో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు తెనాలి సీటు దక్కింది. దీంతో జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయినా అవకాశం దక్కుతుందనే ఆశలు పెట్టుకున్నారు. కానీ టీడీపీ విడుదల చేసిన మూడో జాబితాలోనూ ఆలపాటికి నిరాశ ఎదురైంది. దీంతో తెనాలిలో టీడీపీ శ్రేణుల ఆవేశం కట్టలు తెంచుకుంది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగులబెట్టారు. అటు అలపాటి రాజా సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీకి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారు. పార్టీ శ్రేణులు, కార్యక్తలతో భేటీ అయిన తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read More..

BREAKING: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా?

Advertisement

Next Story