ఆ సీట్లు జనసేనకే.. పొత్తులపై అన్ని ముందే మాట్లాడుకున్నాం

by Ramesh Goud |   ( Updated:2024-01-26 12:19:27.0  )
ఆ సీట్లు జనసేనకే.. పొత్తులపై అన్ని ముందే మాట్లాడుకున్నాం
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలకు అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో టికెట్ దక్కని పార్టీ నేతలు, ఆశావాహులు ఎవరూ నిరుత్సాహపడొద్దని, అసెంబ్లీ ఎన్నికలతోనే మనం ఆగిపోవట్లేదని, తర్వాత జరగబోయే స్థానిక సంస్థలు, పరిషత్ లు, అన్ని పంచాయితీలు, కార్పోరేషన్ ల వరకు మూడో వంతు సీట్లు మనం తీసుకుంటున్నామని, ఇవన్నీ ముందే మాట్లాడుకున్నామని అన్నారు. కేవలం ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోవట్లేదని, పైస్థాయి నుంచి వార్డు మెంబర్ వరకు రాష్ట్రంలో మన నేతలు కీలక పాత్ర పోషిస్తారని తెలియజేశారు.

ఈ పరంగా చూసుకుంటే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో.. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు మూడోవంతు సీట్లు అనగా 58 నుంచి 60 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అలాగే ఇవ్వాళ జనసేన ప్రకటించిన రెండు స్థానాల్లో 2019 ఎన్నికల్లో రాజోలులో 50 వేల ఓట్లు సాదించి జనసేన గెలుపొందగా, రాజనగరంలో వైసీపీ 90 వేల ఓట్లు సాదించి గెలుపొందింది. రాజనగరంలో జనసేన, టీడీపీ కలిపి దాదాపు 80 వేల ఓట్లు సాదించాయి. ప్రస్తుతం వైసీపీపై ఉన్న వ్యతిరేఖత వల్ల రాజనగరంలో మరికొన్ని ఓట్లు సంపాదిస్తే.. రెండు స్థానాలు జనసేన ఖాతాలో పడతాయని జనసేన అభిమానులు ఆశిస్తూ ట్విట్లర్ లో పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Next Story