మద్యం తిరుమలకు చేరిందనడానికి ఈ వీడియోనే నిదర్శనం.. ఆర్కే రోజా సంచలన ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2025-03-15 15:31:07.0  )
మద్యం తిరుమలకు చేరిందనడానికి ఈ వీడియోనే నిదర్శనం.. ఆర్కే రోజా సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి పాలనలో మద్యం తిరుమలకు కూడా చేరింది.. దీనికి ఈ వీడియోనే నిదర్శనం అని మాజీ మంత్రి, వైఆస్ఆర్సీపీ నేత ఆర్‌కే రోజా (YSRCP Leader RK Roja) అన్నారు. తిరుమలలో (Thirumala) ఓ వ్యక్తి మద్యం తాగి వచ్చి, మాడ వీధుల్లో (Mada Streets) హల్ చల్ చేశాడు. ఓ మహిళతో వాగ్వాదానికి దిగి, దూషణలకు పాల్పడ్డాడు. అంతేగాక ఎక్సైజ్ సిబ్బంది (Excise Staff) ఎదుటే.. నేను లోకల్ అంటూ.. నేను మద్యం తాగుతా.. అవసరమై కొండ మీదనే మద్యం అమ్ముతానని, ఎవరికి ఎంత కావాలో చెప్పాలని వీరంగం సృష్టించాడు. గత రెండు రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో (Video) నెట్టింట వైరల్ (Viral) గా మారింది. దీనిపై వైసీపీ నేత రోజా ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వంపై (Coalition government) సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె.. పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఘోర అపచారం జరిగిందని అన్నారు. ఓ మందు బాబు కొండపైన వీరంగం సృష్టించాడని, అంతేకాదు ఎవరికి ఎంత మందు కావాలంటే అంత మందు అమ్ముతా అంటున్నాడని తెలిపారు. అంటే టీడీపీ పార్టీ (TDP Party), జనసేన పార్టీ (Janasena Party), బీజేపీ పార్టీ (BJP Party)ల కూటమి ప్రభుత్వంలో తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ వీడియోనే అందుకు నిదర్శనమని విమర్శలు చేశారు. అంతేగాక రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని ఏరులైపారిస్తున్నారని, ఇప్పుడది తిరుమలకు కూడా చేరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తిరుమలకు తాగిన వ్యక్తి ఎలా వచ్చాడు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Next Story

Most Viewed