- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Political:ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి సాక్షం ఇదే..టీడీపీ కీలక నేత!
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు, విధ్వంసం రెండు కల్లుగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పరిపాలన చేశారని మండిపడ్డారు. ఇక ఇప్పడు గద్దెదిగే సమయంలోనూ అదే విద్వేషం, విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ఇక నిన్న తన కుమారుడు శరత్ ని గుర్తు తెలియని ప్రాంతాల్లో 16 గంటలపాటు 6 పోలీసు స్టేషన్లలో తిప్పి..చివరికి రాత్రి 12 గంటలకు న్యాయమూర్తి ఎదుట ప్రొడ్యూస్ చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన కొడుకుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని.. అసలు తన కోడుకు శరత్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు.
చిలకలూరుపేటలో తాను ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు భారీ మెజారిటీతో గెలిచానని పేర్కొన్నారు. పేటలో ఎవరు చెయ్యని అభివృద్ధిని తాను చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తనని రాజకీయంగా ఎదురుకోలేక..తన కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేసి తనని నైతికంగా ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
తాను న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తున్నాని.. వైసీపీ బెదిరింపులకు భయపడేదే లేదని వెల్లడించారు. ఇక అరాచకాలను, అకృత్యాలను నమ్ముకున్న వైసీపీని ఆ అరాచకాలు, అకృత్యాలే తొక్కిపెడతాయని మండిపడ్డారు. తనకి టికెట్ ప్రకటించిన 24 గంటల్లో తన కుమారుడిపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ ను సృష్టించి ఎందుకోసం, ఎవర్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేశారని మంది పడ్డారు. అలానే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి తన కొడుకు పై పెట్టిన కేసు డీఆర్ఐ రూపకల్పనే సాక్షం అని పేర్కొన్నారు.
Read More..
Breaking: శాంతి భద్రతలకు విఘాతం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్