వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఇదే: ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

by Seetharam |
వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఇదే: ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్థికస్థితిగతులపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ హాయాంలో అప్పులపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేస్తే.. అప్పులు కాదు అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఏపీ అప్పులపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగాయని గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు 55 శాతానికి తగ్గాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో ఉన్న అప్పులకు.. వైసీపీలో ఉన్న అప్పుల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు టీడీపీ ప్రభుత్వం డబ్బును ఖర్చు చేసిందని ఆరోపించారు. పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా, వారి కలలు సాకారమయ్యేలా సీఎం వైఎస్ జగన్ డబ్బును వినియోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed