- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ 53 రోజులు క్షణం ఒక యుగంలా గడిచింది : నారా భువనేశ్వరి
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవ్వడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన అనుభవించినట్లు తెలిపారు. తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచింది అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు తమకు ఎంతో ఊరటనిచ్చింది అని నారా భువనేశ్వరి ట్విటర్ వేదికగా వెల్లడించారు. సత్యం యొక్క బలం ఎంతో చూపించింది. ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, తమకు మరింత స్ఫూర్తినిచ్చాయి అని నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి సోదరుడికి, ప్రతి మహిళకు, ప్రతి పౌరుడికి శిరసు వంచి కృతజ్ఞతలు చెప్తున్నట్లు నారా భువనేశ్వరి అన్నారు. ‘నా భర్త అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడే బస చేసిన నన్ను మీ ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దేవుడి దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాను’ అని నారా భువనేశ్వరి వెల్లడించారు.
Read More..