అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థిని దుర్మరణం

by srinivas |   ( Updated:2024-07-21 15:20:14.0  )
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థిని దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్లహామాలోని నేషనల్ హైవేపై మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థిని హారిక దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన విద్యార్థిని హారిక ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి వాసిగా గుర్తించారు. అమెరికాలో వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం ఏడాదిన్నర క్రితం అమెరికాకు వెళ్లారు. హారిక మృతి చెందిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు ఇండియన్ ఎంబసీ సమాచారం అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ కుమార్తె హారిక మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హారిక తండ్రి ఏపీ దేవాదాయ శాఖలో పని చేస్తున్నట్లుగా తెలిసింది.

Read More..

AP Assembly:రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్?

Advertisement

Next Story