AP News:‘చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదు’.. మాజీ మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |   ( Updated:2024-11-03 10:07:51.0  )
AP News:‘చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదు’.. మాజీ మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా(Former minister Roja) ఫైరయ్యారు. ఈ క్రమంలో ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే, తగలపెడుతుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే ఎందుకు చంద్రబాబు, హోం మంత్రి అనిత(Home Minister Anitha) కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనల పై పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) ఎందుకు నోరు తెరవడం లేదని ఆమె విమర్శించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ జిల్లా అతను అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామని రోజా అన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు ఏది అని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రోజా సూపర్ సిక్స్(Super Six) కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ అన్న మనకు అండగా నిలవాలని ఆమె అన్నారు. తప్పుడు ప్రచారం వల్ల వైసీపీ ఓడిపోయిందన్నారు. చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో పవన్ నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడన్నారు. సంక్షేమ పథకాలు లేవు, విజయవాడ నగరాన్ని చంద్రబాబు నీట ముంచేశారని మాజీ మంత్రి రోజా(Former minister Roja) ఆరోపించారు.

Advertisement

Next Story