సేఫ్ జోన్ లో ఎవరెవరున్నారు ..? మంత్రులు, మాజీ మంత్రుల్లో హై టెన్షన్

by Indraja |
సేఫ్ జోన్ లో ఎవరెవరున్నారు ..? మంత్రులు, మాజీ మంత్రుల్లో హై టెన్షన్
X

దిశ వెబ్ డిస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ లో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు అటు నేతల్లోనే కాదు ఇటు ప్రజల్లోనూ ఉత్కంఠత రేకెత్తిస్తున్నాయి. సేఫ్ జోన్ లో ఎవరున్నారు..? ఎవరి సీటుకి ముప్పుందో తెలియని పరిస్థితి. దీనితో మంత్రులు, మాజీ మంత్రుల్లో హై టెన్షన్ నెలకొంది. మార్పులు చేర్పుల నేపథ్యంలో రోజుకో పేరు వినిపిస్తుంది. కొందరికి స్థాన బదిలీలు ఉంటె మరికొందరికి అసలు టికెట్ కూడా దక్కని పరిస్థితి నేడు వైసీపీ లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఏ ఒక్కరి లోనూ సీటు దక్కుతుందనే ధీమా లేదు. సీఎం జగన్ అధికారం లోకి రాగానే రెండున్నరేళ్లకు మంత్రిమండలిని మార్చేస్తాను అని తెలిపారు. చెప్పింది చెప్పినట్లుగానే చేశారు. ఇప్పుడు కూడా ఆయన గతంలో పని తీరును మార్చుకోవాలని హెచ్చరించిన వాళ్ళ పంథాను మార్చుకొని నేతలను పక్కన పెట్టేస్తున్నారు.

ఈ క్రమంలో జగన్ మంత్రివర్గం లో కీలక బాధ్యతలు నిర్వర్తించే వారు సైతం సీఎం నిర్ణయానికి తలొగ్గి మౌనంగా ఉండిపోతున్నారు. గతంలో పని చేసిన మంత్రులు ప్రస్తుతం మినిష్టర్లుగా ఉన్న వారు సైతం అధిష్టానం అభీష్టాన్ని శిరసావహించాల్సి వస్తుంది. ఇప్పటికే అనకాపల్లి MLA గుడివాడ అమర్నాథ్ ను ఆ నియోజకవర్గం నుండి తప్పించింది అధిష్టానం. ఎక్కడ సీటు ఇస్తారో ఇంకా చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు సీటు ఉంటుందా? లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. మంత్రులు వేణుగోపాలకృష్ణ, ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జున స్థానాలను కూడా మార్చేసింది అధిష్టానం. ఈ లిస్టులో ఇంకొందరు మంత్రులు, మాజీ మంత్రుల పేర్లు వినిస్తున్నాయి. అయితే ఎవరెవరికి స్థాన బదిలీలు ఉంటాయి.. ఎవరెవరిని అధిష్టానం పక్కన పెట్టనుంది అనేది ప్రస్తుతం నేతల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed